logo

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నిరసన గళం

పెద్దకడబూరు మండలంలో రెండో రోజు ఆదివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేపట్టిన ప్రచార యాత్రలో ఊరూరా తాగునీటి సమస్యలు వెల్లువెత్తాయి. జాలవాడి గ్రామస్థులు తాగునీరందించాలని కోరారు.

Published : 06 May 2024 03:27 IST

జాలవాడిలో తాగునీరు అందించాలని  ఎమ్మెల్యేను అడుగుతున్న మహిళలు

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: పెద్దకడబూరు మండలంలో రెండో రోజు ఆదివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేపట్టిన ప్రచార యాత్రలో ఊరూరా తాగునీటి సమస్యలు వెల్లువెత్తాయి. జాలవాడి గ్రామస్థులు తాగునీరందించాలని కోరారు. జగనన్న ఇళ్లు, పింఛన్లు మంజూరు కాలేదని మహిళలు విన్నవించారు. కంబళదిన్నె గ్రామంలో తాగు, సాగునీటి సమస్యలు తీర్చాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే జాలవాడి, కంబళదిన్నె గ్రామాలకు ఎన్నికల అనంతరం రూ.10 కోట్లతో ఎస్‌ఎస్‌ ట్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాగలాపురం, సింగరాజనహళ్లి, బసలదొడ్డి గ్రామాల్లో మహిళలు తాగడానికి గుక్కెడు నీరు లేదని వాపోయారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తానంటూ ముందుకు వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని