logo

ఓటు వేయడానికి అవకాశం కల్పించాలి

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పీఓ, ఏపీఓలకు పట్టణంలోని వైపీపీఎం పాఠశాల ఆవరణలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Updated : 06 May 2024 16:13 IST

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పీఓ, ఏపీఓలకు పట్టణంలోని వైపీపీఎం పాఠశాల ఆవరణలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 590 మంది పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే వీరిలో దాదాపు 70 మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఓటర్లకు సంబంధించిన జాబితా ఇంకా రావాల్సి ఉందని సాకుగా చూపుతూ తమను ఓటు వేయనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని పోలింగ్‌ సిబ్బంది ఆరోపించారు. ఓటింగ్‌కు ఇంకా గడువు ఉందని ఆలోగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు అంటున్నా తమకు నమ్మకం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని