logo

కళలకు వేదిక..ప్రతిభా వీచిక

చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

Updated : 20 May 2024 04:35 IST

 కళారాధనలో ఉచిత శిక్షణలు

బొమ్మలు గీయడంలో తర్ఫీదు పొందుతున్న బాలలు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఏటా వేసవిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల చిన్నారులు వారికి ఇష్టమైన అంశాలను నేర్చుకునేలా వెన్నుదన్నుగా నిలుస్తోంది. వివిధ విభాగాల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. శాసీˆ్త్రయ నృత్యం, ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, వాయిద్య సంగీతంలో గిటార్, కీబోర్డు, మిమిక్రి, వెంట్రిలాక్విజం, చిత్రలేఖనం, దస్తూరి, హస్తకళలు, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్, పద్యపఠనం, సంస్కృత శ్లోకాలు, కవితాగానం, కవితారచన, చదరంగం, కరాటే, తైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో నిపుణులతో తర్ఫీదు ఇస్తోంది. కొన్ని ఏళ్లుగా పిల్లలు ఇక్కడ శిక్షణ పొంది వివిధ  వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి శభాష్‌ అనిపించుకుంటున్నారు. కొంత మంది ఇక్కడే శిక్షణ పొంది ప్రస్తుతం కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు.

ఆనందంగా ఉంది

ప్రస్తుతం 22వ కళారాధన శిబిరాన్ని మే 26 వరకు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రెండు దశాబ్దాలుగా వివిధ రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం మరువలేనిది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు వివిధ విభాగాలలో శిక్షణ పొంది ఉన్నత స్థాయిలోకి వెళ్లడం హర్షనీయం. ఈ సారి వేసవి శిక్షణశిబిరాలు నిర్వహిస్తాం. 25 మంది శిక్షకులతో తర్ఫీదు ఇస్తున్నాం.

డాక్టర్‌ మధుసూదన్‌రావు, కళారాధన అధ్యక్షుడు

సేవలు అందిస్తున్నాం

కరోనా సమయంలో మినహా మిగతా అన్ని సంవత్సరాలు వేసవిలో లలితకళల ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. వేసవిలో విద్యార్థులకు అదనంగా ఉపయోగపడే కళానైపుణ్యాలు అందిస్తున్నాం. ప్రతి ఏటా 20 విభాగాల్లో 400 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఉచితంగా ఇస్తున్నాం. ఇక్కడే శిక్షణ పొందిన విద్యార్థులు నేడు కోచ్‌లుగా వ్యవహరించడం అభినందనీయం. ఒకేసారి 20 విభాగాలలో అందిస్తున్నాం. శిక్షణ తరగతుల ముగింపు రోజున విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ప్రశంసాపత్రాలు అందించనున్నాం.

 డాక్టర్‌ రవికృష్ణ, కళారాధన ప్రధాన కార్యదర్శి

శిక్షకుడిగా చేయడం సంతోషకరం

నంద్యాల కళారాధన ప్రారంభమైన 2000 సంవత్సరం నుంచి నేను డ్యాన్స్‌లో శిక్షణ పొందాను. కొన్ని సంవత్సరాల పాటు తర్ఫీదు పొందిన అనంతరం ఇక్కడే శిక్షకుడిగా సేవలు అందించడం గర్వకారణం. ఎంతోమంది విద్యార్థులు వేసవిలో ఉచితంగా డ్యాన్స్‌ను నేర్చుకుంటున్నారు.

సతీష్, డ్యాన్స్‌మాస్టర్, నంద్యాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని