logo

దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్లపై దుష్ప్రచారం : అరుణ

బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు.

Published : 30 Apr 2024 05:55 IST

చిర్మల్‌కుచ్చతండాలో పూజలు చేస్తున్న భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

హన్వాడ, న్యూస్‌టుడే : బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టిని మరల్చేందుకే భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె హన్వాడ మండలం చిర్మల్‌కుచ్చతండా, చిన్నదర్పల్లి, నాయినోనిపల్లి, పెద్దదర్పల్లి గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో భయపెట్టి ఎస్సీ, ఎస్టీలను పక్కదారి పట్టిస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, బుచ్చిరెడ్డి, రతంగ్‌ పాండురెడ్డి, అంజయ్య, రఘురాములుగౌడ్‌, వెంకటయ్య, బుచ్చన్న పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ గ్రామీణం : మహబూబ్‌నగర్‌ మండలం మణికొండ, రామచంద్రాపూర్‌, మాచన్‌పల్లి, కోడూరు, తెల్గుగూడెం, జమిస్తాపూర్‌ గ్రామాల్లో డీకే అరుణ ఆదివారం రాత్రి ప్రచారం చేశారు. సర్పంచి, ఎంపీటీసీ సభ్యులుగా భాజపా మద్దతుదారులు గెలవటం వల్లనే మణికొండ అభివృద్ధి సాధించిందన్నారు. ఎంపీగా భాజపా అభ్యర్థిని గెలిపిస్తే ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక న్యాయంతో పాటు సంక్షేమ పథకాలు అందించటం మోదీతోనే సాధ్యమని, దేశ భవిష్యత్తు కోసం భాజపాకు అండగా నిలవాలని ఆమె కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని