logo

ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!

రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.

Published : 17 May 2024 02:05 IST

జూన్‌ 4న  కౌంటింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. లెక్కింపు కేంద్రాల వివరాలివీ...

మహబూబ్‌నగర్‌: కొడంగల్‌- మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం, లైబ్రరీ హాల్‌; నారాయణపేట- (ఇండోర్‌ గ్రేమ్స్‌ కాంప్లెక్స్‌); మహబూబ్‌నగర్‌- (ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌); జడ్చర్ల- (ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌-కుడి వైపు); దేవరకద్ర- (ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌-ఎడమ వైపు); మక్తల్‌- (ఇండోర్‌ స్టేడియం); షాద్‌నగర్‌- (రూమ్‌ నంబరు 22, 24, 25, ఫస్ట్‌ ఫ్లోర్‌, ఫార్మాస్యూటికల్‌ బ్లాక్‌)

నాగర్‌కర్నూల్‌: వనపర్తి, గద్వాల, అలంపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌- వ్యవసాయ మార్కెట్‌ యార్డు, నెల్లికొండ, నాగర్‌కర్నూల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు