logo

ఈడబ్ల్యూఎస్‌.. ధ్రువపత్రం పొందడమిలా..!

కేంద్రం అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌) రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడేళ్ల కిందట అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం

Published : 28 Sep 2022 01:29 IST

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

కేంద్రం అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌) రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడేళ్ల కిందట అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం కల్పించిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌ రాష్ట్రంలోనూ అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశ సమయంలోనూ, ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులకు ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అర్హత ఉన్న వారు ఆ ప్రయోజనాలు పొందాలంటే స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఇచ్చే ధ్రువపత్రం తప్పనిసరి. ప్రస్తుతం విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మార్గం సుగమం కావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తుండటంతో సదరు ధ్రువపత్రాలకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. వీటిని పొందడం గురించి ఇలా..

నిబంధనలు ..

పట్టణాల్లో అయితే 100 చదరపు గజాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాలకు మించి సొంత నివాస గృహం ఉన్నవాళ్లు అనర్హులు.

పట్టణ ప్రాంతాల్లో 200 చదరపు గజాలకు, గ్రామాల్లో అయితే 1000 చదరపు గజాలకు మించి నివాస స్థలం/వ్యాపార స్థలం గానీ ఉండకూడదు.

రూ.8 లక్షల్లోపు సంవత్సరాదాయం కలిగి ఉండాలి.

5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారే అర్హులు.

దరఖాస్తు విధానం..

మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌, ఆదాయ, స్థానికత, కుల ధ్రువీకరణ పత్రాలు... వీటిని ధ్రువీకరిస్తూ నోటరీ అఫిడవిట్‌, ఫొటో సమర్పించాలి. విద్యార్థులు చదువుకు సంబంధించిన ధ్రువపత్రం, జనన ధ్రువపత్రం లేదా టీసీ దరఖాస్తుతో జతపర్చాలి. 30 రోజుల్లో దరఖాస్తుదారు అభ్యర్థనను పరిశీలించి ఏ విధమైన అభ్యంతరాలు లేకుంటే తహసీల్దారు ఆమోదం తెలుపుతూ జారీ చేస్తారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని