logo

అప్పుల బాధతో కార్పెంటర్‌ ఆత్మహత్య

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్‌ఐ శివకుమార్‌ తెలిపిన వివరాలు..

Published : 29 Mar 2024 02:48 IST

రమేష్‌

మెదక్‌ రూరల్‌, న్యూస్‌టుడే: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్‌ఐ శివకుమార్‌ తెలిపిన వివరాలు.. హవేలిఘనపూర్‌ మండలం తొగిటకు చెందిన రమేష్‌(29) మూడేళ్లుగా మంబోజిపల్లిలో కార్పెంటర్‌ దుకాణం నడిపిస్తున్నారు. ఇందుకోసం చేసిన అప్పు రూ.3 లక్షలు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తరచూ తన భార్యతో చెప్పి బాధపడేవారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఇంట్లో చెప్పి దుకాణానికి వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు కంగారుపడ్డారు. ఇదిలా ఉంటే రమేష్‌ దుకాణం షట్టర్‌ గురువారం ఉదయం సగమే తీసి ఉన్నట్లు కనిపించడంతో అనుమానం వచ్చి పక్కనే దుకాణం నడిపిస్తున్న పాపన్నపేట మండలం కొడుపాకకు చెందిన పరిపూర్ణ కింది నుంచి తొంగిచూడగా రమేష్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న గ్రామీణ ఠాణా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రమేష్‌కు తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని