logo

ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌ రాజ్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్‌ మాధవ్‌ కుర్కోటి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.

Published : 07 May 2024 03:48 IST

కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌, సాధారణ పరిశీలకులు సమీర్‌ మాధవ్‌ కుర్కోటి

మెదక్‌, న్యూస్‌టుడే: అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌ రాజ్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్‌ మాధవ్‌ కుర్కోటి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఎన్నికల సంఘం అదనపు ఈవీఎంలను కేటాయించింది. వీటికి ఈఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తూ ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు  పాల్గొన్నారు.

ఎన్నికల సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దు

పోలింగ్‌ విధులు, ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై సోమవారం ఆయన సంబంధిత సహాయ రిటర్నింగ్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్లమెంట్‌ పరిధిలో ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పలు సూచనలు చేశారు.

ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి

ఎన్నికల నిర్వహణకు సంబంధించి నగదు, మద్యం జప్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు, 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌, సీ-విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో గమనించే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనల నివేదికలను ప్రతిరోజు సమర్పించాలని సాధారణ పరిశీలకులు సమీర్‌ మాధవ్‌ కుర్కోటి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎన్నికల సమీకృత ఫిర్యాదులు పర్యవేక్షణ కేంద్రంను పరిశీలించారు. ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రంలో జీపీఎస్‌ మానిటరింగ్‌, 1950 కాల్‌ సెంటర్‌, కంట్రోల్‌ రూం, సీ-విజిల్‌, ఎంసీఎంసీ, సోషల్‌ మీడియా విభాగాల పనితీరు గురించి ఆరా తీశారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని