logo

ఎన్‌ఆర్‌ఐలతో జానారెడ్డి ఇష్టాగోష్ఠి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఎన్‌ఆర్‌ఐలను కోరారు. ఆదివారం ఆయన సాగర్‌లోని తన నివాసగృహం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

Updated : 06 May 2024 05:52 IST

ఎన్‌ఆర్‌ఐలతో జూమ్‌ ద్వారా మాట్లాడుతున్న జానారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, ప్రవాస భారతీయుడు రవీందర్‌రెడ్డి

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఎన్‌ఆర్‌ఐలను కోరారు. ఆదివారం ఆయన సాగర్‌లోని తన నివాసగృహం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రవాసీలకు ద్వంద్వ పౌరసత్వం తేవడానికి కృషి చేస్తుందని, ఎన్‌ఆర్‌ఐ భాగస్వామంతో ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ పనులను వెంటనే పూర్తి చేయడానికి, ప్రవాసీ తెలంగాణ భవన్‌ నిర్మాణానికి భూమి కేటాయింపు, గ్రామాల్లో కార్పొరేట్‌ విద్యను అందజేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్‌ కార్మికుల రక్షణకు నూతన చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు. ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని