logo

రాజకీయ ప్రకటనలు, వార్తలను నిశితంగా పరిశీలించాలి

ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తలను నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే సూచించారు.

Updated : 06 May 2024 17:11 IST

భువనగిరి: ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తలను నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే సూచించారు. సోమవారం కాన్ఫరెన్స్ హలులో ఆయన సభ్యులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను పరిశీలించాలని, ఓటరుపై ప్రభావితం చేసే వార్తల పట్ల అప్రమతంగా ఉండాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్, లోకల్ కేబుల్ ఛానల్స్, సోషల్ మీడియా, వాట్సప్, ఈ పేపర్లలో రాజకీయ ప్రకటనలు మానిటరింగ్ చేయాలని వివరించారు. అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే రిటర్నింగ్ అధికారికి తెలిపి నోటీస్ జారీ చేయాలని అన్నారు. సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, జిల్లా సంబంధాల అధికారి పి. వెంకటేశ్వర రావు, సోషల్ మీడియా నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి,  కమిటీ సభ్యులు జి.దయాకర్, కె.శ్రీనివాస్, ఎ.శ్రవణ్, పాల్గొన్నారు. సోమవారం ఆయన రాయగిరిలోని విద్యాజ్యోతి హైస్కూలులో ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల విధులలో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని