logo

వేసవి శిబిరం.. క్రీడలకు ఊతం

వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు బాలలతో సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, ఖోఖో, బాల్‌ బ్యాడ్మింటన్‌, తైక్వాండో క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.

Published : 08 May 2024 03:30 IST

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు బాలలతో సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, ఖోఖో, బాల్‌ బ్యాడ్మింటన్‌, తైక్వాండో క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన కేంద్రాలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్న వారికి రూ.4 వేల పారితోషికంతో పాటు రూ.5వేల విలువైన క్రీడా సామగ్రిని అధికారులు అందించారు. ప్రస్తుతం అత్యధిక కేంద్రాలు పరిమితికి మించి పిల్లలతో కొనసాగుతుండటం గమనార్హం.

ప్రయోజనం ఇలా...

వేసవి క్రీడల శిక్షణ కేంద్రాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి 13 మంది విద్యార్థులు హకీంపేట, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు పొంది చదువు కొనసాగిస్తున్నారు. ఆయా విద్యార్థులు డిగ్రీ వరకు ఉచిత విద్యతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాంశంలో ప్రతిభ చాటి క్రీడాకారుడిగా రాణించే అవకాశం లభిస్తోంది. జిల్లా పరిధిలో ఒక ఫుట్‌బాల్‌, నాలుగు వాలీబాల్‌, రెండు తైక్వాండో, బాల్‌ బ్యాడ్మింటన్‌, రెండు ఖోఖో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 40 మంది పిల్లలను చేర్చుకోవాల్సి ఉన్నప్పటికి 50కి పైగా పిల్లలు హాజరవుతున్నారు. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.


క్రీడాంశాలపై ఆసక్తి

- ధనంజేయులు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి

ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్న వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలతో తమకు ఆసక్తి ఉన్న క్రీడలో శిక్షణ పొందుతున్నారు. శిబిరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాం. వేసవి సెలవుల్లో పిల్లల క్రీడా భవితకు పునాది పడుతుంది. భవిశ్యత్తులో మంచి క్రీడాకారుడిగా ఎదిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని