ఆటలాడుతూ.. అనంతలోకాలకు
బుడిబుడి అడుగులతో ఇంటిల్లిపాదిని అలరిస్తున్న చిన్నారి క్షణాల వ్యవధిలో విగతజీవిగా మారటంతో తల్లిదండ్రుల శోకాన్ని ఆపటం ఎవరితరంకాలేదు.
రేణుప్రియ మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి సీనయ్య
సాయిపేట(కొండాపురం), న్యూస్‌టుడే: బుడిబుడి అడుగులతో ఇంటిల్లిపాదిని అలరిస్తున్న చిన్నారి క్షణాల వ్యవధిలో విగతజీవిగా మారటంతో తల్లిదండ్రుల శోకాన్ని ఆపటం ఎవరితరంకాలేదు. చిన్నారి మృతి గ్రామస్థులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. వాహనం వెనకాల ఆడుకుంటున్న చిన్నారి దాని టైరు కిందపడి మృతి చెందిన ఘటన మండలంలోని సాయిపేటలో సోమవారం చోటుచేసుకుంది. అప్పటి వరకు తమ కళ్ల ముందు నాన్న..అమ్మ అంటూ ఆడుకుంటున్న తన ముద్దుల కూతురు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఎస్సై షేక్ ఖాజావలి తెలిపిన వివరాల మేరకు.. కావలి నుంచి టాటా మ్యాజిక్ వాహనంలో కూల్‌డ్రింక్స్ తీసుకుని సాయిపేటలోని వివిధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. సంగం కాలనీ దుకాణం వద్ద వాహనం నిలిపి సరకును దించివేశారు. అక్కడి నుంచి వెళ్లేందుకు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి మళ్లిస్తుండగా వెనకాల ఉన్న తలపల రేణుప్రియ(2) అనే చిన్నారి టైరు కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన కాలనీవాసులు హుటాహుటిన వాహనం వద్దకు చేరుకుని బాలికను పరిశీలించారు. తలకు బలమైన గాయం అవటంతో అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులు తలపల నాగమణి, సీనయ్య రోదన స్థానికులను కలచివేసింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి