logo

సముద్ర జలాలు కలుషితం కానివ్వం

సముద్ర జలాలు కలుషితం కాకుండా, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో సంజయ్‌ కోత సూచించారు.

Updated : 09 Jun 2023 06:49 IST

ప్రతిజ్ఞ చేస్తున్న ఉద్యోగులు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: సముద్ర జలాలు కలుషితం కాకుండా, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదాని కృష్ణపట్నం పోర్టు  సీఈవో సంజయ్‌ కోత సూచించారు. ప్రపంచ వోషన్‌ డే సందర్భంగా పోర్టులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సముద్ర జలాల నుంచే అధికంగా అక్సిజన్‌ అందుతుందన్నారు. పోర్టు ఆధ్వర్యంలో అయిదు ఫైబర్‌ బోట్స్‌ ద్వారా సముద్రంలోని చెత్తను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించామని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు పరిధిలోని సముద్ర జలాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగి ఉండేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పోర్టు జలాల పరిరక్షణకు కృషి చేస్తామని ఉద్యోగులు, కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కోస్ట్‌ గార్డ్‌ డిప్యూటీ కమాండర్‌ గిరీష్‌ కుమార్‌, మెరైన్‌ హెడ్‌ కెప్టన్‌ పాడియా, అడ్మిన్‌ హెడ్‌ గణ్‌ష్‌ శర్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని