logo

మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం

విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది.

Published : 19 Apr 2024 03:46 IST

జాతీయ రహదారిలో లారీ డ్రైవర్లపై దాడి
పోలీసుల అదుపులో ఒకరు

మనుబోలు, న్యూస్‌టుడే : విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. గూడూరు వెళుతున్న మెములో పడుగుపాడు వద్ద కోవూరుకు చెందిన ముగ్గురు రైలెక్కారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కొండూరుసత్రం సమీపంలోనికి రాగానే ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగి వారివద్ద ఉన్న చరవాణులు, నగదు లాక్కున్నారు. బ్యాగులు తనిఖీ చేస్తూ బీభత్సం సృష్టించారు. గూడూరు జీఆర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంతలో మనుబోలు రైల్వేస్టేషన్‌ దాటిన తరువాత సిగ్నల్‌ లేక రైలు ఆగడంతో ఇదే అదనుగా భావించిన దుండగులు దిగి వీరంపల్లి అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై చేరుకున్నారు. లారీలను ఆపి వారిపై రాళ్లతో దాడికి దిగి దోపిడీకి యత్నించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు తప్పించుకొని పారిపోగా, కోవూరు ఇనుమడుగు సెంటర్‌ లక్ష్మీనగర్‌కు చెందిన కొప్పోలు సాగర్‌ను పట్టుకున్నారు. కేసునమోదు చేసి విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని