logo

ప్రమాదంలో పౌర హక్కులు

దేశంలో పదేళ్లుగా పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మువ్వా నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు.

Updated : 06 May 2024 06:05 IST

మాట్లాడుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

ఖలీల్‌వాడి, న్యూస్‌టుడే: దేశంలో పదేళ్లుగా పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మువ్వా నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. జిల్లా పౌర హక్కుల ఉద్యమంలో నాగేశ్వరరావు క్రియాశీలకంగా పని చేశారని గుర్తు చేశారు. భాజపా ప్రభుత్వ నియంతృత్వ చర్యలను ఖండించాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు రవీందర్‌, సురేష్‌, సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి కృష్ణ, డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతన్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు రామ్మోహన్‌రావు, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని