logo

లెక్క తప్పారు..!

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆయా సబ్జెక్టుల్లో 1303 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 11,926 మంది పరీక్షలు రాయగా 11,057 ఉత్తీర్ణులయ్యారు. 92.71 శాతం ఫలితాలు నమోదయ్యాయి.

Published : 06 May 2024 04:42 IST

భాషల్లో, గణితంలో అధికంగా అనుత్తీర్ణత
కామారెడ్డి పట్టణం-న్యూస్‌టుడే

పదో తరగతి విద్యార్థులు

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆయా సబ్జెక్టుల్లో 1303 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 11,926 మంది పరీక్షలు రాయగా 11,057 ఉత్తీర్ణులయ్యారు. 92.71 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ముఖ్యంగా భాష(1,2,3)ల్లో కలిపి మొత్తం 524 మంది అనుత్తీర్ణులయ్యారు. మరోవైపు లెక్కల్లోనూ వెనుకబడ్డారు. సూత్రాలు, పటాలపై శ్రద్ధ చూపలేదు. సామాన్యశాస్త్రంపై సైతం మక్కువ తగ్గింది. ఫలితంగా ఉత్తీర్ణత శాతం తగ్గింది.
పదో తరగతి ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో మూడంకెల మంది అనుత్తీర్ణులైన విషయం తాజాగా వెలుగుచూసింది. దీనికి ప్రధాన కారణంగా విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం, యంత్రాంగం పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి వచ్చింది. గతేడాది నవంబరు నాల్గోవారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. మూడు నెలల పాటు కొనసాగించారు. రోజూ ఒక విషయ నిపుణుడితో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అయినా పది ఫలితాల్లో గతేడాది 7వ స్థానంలో నిలవగా ఈ సారి 19కి చేరింది. వివిధ సబ్జెక్టుల్లో వందల్లో అనుత్తీర్ణులు కావడం విద్యాశాఖ వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.


ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం

- రాజు, డీఈవో-కామారెడ్డి

పది ఫలితాల్లో గతేడాది కన్నా ఈసారి 0.62 శాతం మాత్రమే తగ్గింది. ఆయా విషయాల్లో అనుత్తీర్ణులైనవారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించాం. ఫలితాలు తగ్గడంపై విద్యాశాఖ ఆధ్వర్యంలో సమీక్షిస్తున్నాం. మెరుగైన ఫలితాల సాధన దిశగా చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని