logo

నవీన్‌జీ... మీకు 25 ఏళ్లు చాల్లేేదా?: ధర్మేంద్ర

రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్‌ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశ్నించారు.

Published : 18 May 2024 01:00 IST

మాట్లాడుతున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్‌ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశ్నించారు. గురువారం రాత్రి సంబల్‌పూర్‌లో ఏర్పాటైన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సీఎంను నిశితంగా విమర్శించారు. ప్రజలకు మంచినీరు, వ్యవసాయరంగానికి సాగునీరు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన నవీన్‌ పరాయి వారికి పాలన అప్పగించి నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. పశ్చిమ ఒడిశాలో ప్రధాన నగరమైన సంబల్‌పూర్‌కు ఏం చేశారని నిలదీశారు. ఆదాయ వనరులు, కేంద్రం సమకూరుస్తున్న నిధులు పుష్కలంగా ఉన్నా, ప్రగతి రథచక్రాలు పరుగులు తీయకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులూ లేవన్నారు. బిజద పాలకులకు 25 ఏళ్లు అవకాశమిచ్చిన ప్రజలు రానున్న అయిదేళ్లు భాజపాకు పాలనాపగ్గాలివ్వాలని, డబుల్‌ ఇంజిన్‌ పాలనకు ఓట్లేయాలని పిలుపునిచ్చారు. సంబల్‌పూర్‌ అభివృద్ధే ధ్యేయంగా తనను గెలిపించాలని ఓటర్లకు ధర్మేంద్ర కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని