logo

అయిదేళ్లలో బొత్స సోదరుల ఆస్తులు రెట్టింపు

నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్‌ దాఖలు చేయలేదు.

Published : 20 Apr 2024 03:57 IST

జనసేన అభ్యర్థి నాగమాధవి ఆస్తి రూ.894 కోట్లు

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే యంత్రాంగం: నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్‌ దాఖలు చేయలేదు. నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తున్న లోకం నాగమాధవి కుటుంబ ఆస్తి రూ.894.92 కోట్లు ఉంది. ఈ కుటుంబానికి రూ.800 కోట్లకు పైగా విలువైన మిరాకల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. ఈ అయిదేళ్లలో మంత్రి బొత్స కుటుంబ ఆస్తులు రెట్టింపు కంటే అధికంగానే పెరిగాయి. ఈ అయిదేళ్లలో ఆయన సోదరుడు గజపతినగరం వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనరసయ్యకు ఆస్తులే కాదు అప్పులు సైతం పెరిగాయి. ఆయన వద్ద 35 తులాల బంగారం ఉండగా, అతని భార్య వద్ద 80 తులాల బంగారం ఉంది. సోదరుడు సత్యనారాయణ వద్ద 31 తులాల బంగారం ఉంది. అఫిడవిట్లలో అభ్యర్థులు పొందుపర్చిన ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని