logo

ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు  తెలుసునని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారట్‌ పేర్కొన్నారు.

Published : 06 May 2024 03:11 IST

మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారట్‌

పాలకొండ/ గ్రామీణం, న్యూస్‌టుడే: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు  తెలుసునని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారట్‌ పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపిస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. ఆదివారం రాత్రి పాలకొండలో జరిగిన ఇండియా కూటమి ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు.  అరకు పార్లమెంట్‌ పరిధిలో నేటికీ గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎన్నికైన వైకాపా ఎంపీలు అయిదేళ్లూ పార్లమెంట్‌లో పెవికాల్‌ రాసుకుని మౌనంగా కూర్చొన్నారని  విమర్శించారు. తమ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాచిపెంట అప్పలనర్స, పాలకొండ శాసనసభస్థానం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి సవర చంటిబాబులను గెలిపించాలని ఆమె కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని