logo

ప్రైవేటు ఉద్యోగులకు ఎన్నికల విధులు

ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు.

Published : 06 May 2024 03:26 IST

పార్వతీపురం పోలింగ్‌ కేంద్రం వద్ద వరుసలో కూర్చున్న ఉద్యోగులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు చెందిన 30 మంది వరకు ఈసారి విధుల్లో పాలుపంచుకోనున్నారు. వీరందరికీ పోలింగు పర్సన్లగా బాధ్యతలు అప్పగించే వీలుందని చెబుతున్నారు.  

కేంద్రాల ఎదుట ఉద్రిక్తత

పార్వతీపురం గ్రామీణం/పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం పరిసరాలు ఆదివారం ఉద్రిక్తంగా మారాయి. మండల కార్యాలయం ఎదుట ఉద్యోగ సంఘాలు, రాజకీయ నాయకులు టెంట్లు వేసి ఓటర్లకు సహకారం అందించారు. ఈనేపథ్యంలో తమ గుర్తులు చెబుతూ ఓటర్ల వెంటపడ్డారు. పోలింగ్‌ కేంద్రం ఆవరణలో 144 సెక్షన్‌ అమలులో ఉందని హెచ్చరిస్తూ పట్టణ ఎస్‌ఐ రవీంద్రరాజు, పోలీసులు వారిని చెదరగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని