logo

పాలవలస కుటుంబానికి చుక్కెదురు!

వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది.

Published : 06 May 2024 03:35 IST

విక్రాంత్‌ స్వగ్రామం పనసనందివాడ వాసుల మద్దతు కూటమికే

జయకృష్ణతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న రవికుమార్‌

వీరఘట్టం, న్యూస్‌టుడే: వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది. ఇక్కడి నుంచి పాతపట్నం జనసేన టికెట్‌ ఆశించిన కొరికాన రవికుమార్‌ స్థానికులకు చైతన్యం కల్పించి, జనసేనలో చేరేలా చేశారు.  ఆదివారం రాత్రి ఆ పార్టీ పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి(కూటమి) నిమ్మక జయకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు కొరికాన సన్యాసినాయుడు, శామ్యూల్‌, జీవరత్నం, సుందరరావు, ప్రసాద్‌, లక్ష్మణ్‌, ఫణికుమార్‌, ఆదినారాయణ, కూర్మినాయుడు, రామకృష్ణ, పోలినాయుడుతో పాటు 200 కుటుంబాల వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, ఉదయాన ఉదయభాస్కర్‌, గేదెల రమేష్‌, మాచర్ల అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని