logo

పశ్చిమాన పిడుగుల వాన

అకాల వర్షాలు.. ఈదురుగాలులు పశ్చిమ ప్రకాశాన్ని అతలాకుతలం చేశాయి. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది.

Updated : 27 Mar 2023 06:20 IST

నేలవాలి దెబ్బతిన్న పంటలు
పదుల సంఖ్యలో జీవాల మృత్యువాత

ఈదురుగాలులకు మార్కాపురం మండలం పడమటిపల్లెలో విరిగి పడిన అరటి చెట్లు

మార్కాపురం గ్రామీణం, పొదిలి గ్రామీణం, పీసీపల్లి- న్యూస్‌టుడే: అకాల వర్షాలు.. ఈదురుగాలులు పశ్చిమ ప్రకాశాన్ని అతలాకుతలం చేశాయి. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. వీటితో పాటు పడిన పిడుగులు పదుల సంఖ్యలో జీవాల ప్రాణాలు తీశాయి. మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయతీ పడమటిపల్లెలో నారు చిన్న సుబ్బారెడ్డి, నారు పుష్పావతికి చెందిన అయిదు ఎకరాల అరటి తోట ధ్వంసమైంది. మరో 15 నుంచి 20 రోజుల్లో కాయలు చేతికి వస్తాయని.. ఈ దశలో చెట్లు నేలకూలడంతో పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. గజ్జలకొండ గ్రామానికి చెందిన ఎన్‌.యల్లారెడ్డి అనే రైతు అయిదు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట ఈదురుగాలులకు నేలవాలింది. పెద్దారవీడు మండలం కంభంపాడులోనూ అరటి తోటలకు నష్టం వాటిల్లింది. పొదిలి మండలం సూదనగుంటలో పిడుగుపాటుకు రెడ్డిబోయిన లక్ష్మయ్య, రెడ్డిబోయిన చిన్న సుబ్బయ్య, మొర్రి ఆదినారాయణలకు చెందిన 38 జీవాలు మృతి చెందాయి. పీసీపల్లి మండలంలోని మెట్లవారిపాలెంలో పిడుగుపాటుకు ఓ గేదె మృతి చెందింది.

గజ్జలకొండలో నేలకొరిగిన మొక్కజొన్న పైరును చూపుతున్న రైతు యల్లారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని