logo

జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్‌కుమార్‌ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్‌ సాయిరాం 1736, ఆర్‌. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు.

Published : 26 Apr 2024 04:35 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్‌కుమార్‌ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్‌ సాయిరాం 1736, ఆర్‌. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. కళాశాల ఛైర్మన్‌ ఏవీ రమణారెడ్డి, డైరెక్టర్లు గణేష్‌రెడ్డి, గంగా శంకరరెడ్డి విద్యార్థులను అభినందించారు. గోపీచంద్‌ ఓపెన్‌ కేటగిరీలో 99.33 పర్సంటైల్‌ సాధించినట్లు ఛైర్మన్‌ తెలిపారు.

  • నారాయణ జూనియర్‌ కళాశాల విద్యార్థి వెంకట్‌ నిఖిల్‌ జేఈఈ ఆలిండియా స్థాయిలో 388 ర్యాంకు, సీహెచ్‌ ఓంకార్‌ వరుణ్‌ కాశీవిశ్వనాథ్‌ 1759 ర్యాంకు సాధించారు. వారిని డీన్‌ పిచ్చిరెడ్డి, ప్రిన్సిపల్స్‌ శ్రీనివాస్‌, సుజాత అభినందించారు.
  • శ్రీప్రతిభ జూనియర్‌ కళాశాల విద్యార్థి వెన్న జయచంద్రారెడ్డి 535వ ర్యాంకు, కండ్లగుంట పూజిత 1423 ర్యాంకును కైవసం చేసుకుంది. వారిని ఛైర్మన్‌ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్‌ ఛైర్మన్‌ సీతారామాంజనేయులు, సీఈవో జయప్రకాష్‌ నారాయణ్‌ అభినందించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని