logo

జోరు మీదున్న సైకిల్‌

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో వందలాదిమంది చేరుతుండటంతో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.

Published : 06 May 2024 02:14 IST

వైకాపాకు చెందిన 250 మంది చేరిక

దామచర్ల జనార్దన్‌ సమక్షంలో చేరిన నాయకులు, కార్యకర్తలు  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో వందలాదిమంది చేరుతుండటంతో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఒంగోలు నగరంలోని 11వ డివిజన్‌ (క్లౌపేట)కు చెందిన వైకాపా నాయకులు రాయపాటి వినోద్‌కుమార్‌, సుందర్‌ సింగ్‌, తేళ్ల సుజిత్‌, రాయపాటి అనిల్‌, తెలగలపూడి బెంజిమెన్‌తోపాటు, 150 మంది పార్టీ తీర్థం తీసుకున్నారు. ఆదివారం ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంటు తెదేపా అభ్యర్థులు దామచర్ల జనార్దన్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డి సమక్షంలో వారు తెదేపాలో చేరారు. 9వ డివిజన్‌ పులి వెంకటరెడ్డి కాలనీకి చెందిన వైకాపా నాయకులు జిలకర నవీన్‌, జిలకర మని, శిరి అశోక్‌, సాంబతోపాటు, 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

వైకాపా అభిమానులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎస్‌ఎన్‌ పాడు తెదేపా అభ్యర్థి బీఎన్‌ విజయ్‌కుమార్‌

నాగులుప్పలపాడు : మట్టిగుంట గ్రామంలో వైకాపాకు చెందిన వంద కుటుంబాలు సీనియర్‌ నాయకులు దివి పున్నారావు ఆధ్వర్యంలో తెదేపాలోకి చేరాయి. సంతనూతలపాడు తెదేపా అభ్యర్థి బీఎన్‌ విజయ్‌కుమార్‌ సమక్షంలో వారు చేరారు. ఈ మేరకు ఆదివారం ఒంగోలులోని ఆయన నివాసానికి వచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, రాష్ట్ర తెదేపా సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్‌కుమార్‌, క్టస్టర్‌ ఇన్‌ఛార్జులు కాకర్ల లక్ష్మీవరప్రసాద్‌, గుమ్మడి సాయిబాబా, మండల ఎస్సీసెల్‌ అధ్యక్షుడు జాన్సన్‌ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని