logo

ఇంటి గుమ్మంలోనే ఓటు

ఎనభై అయిదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది.

Published : 06 May 2024 02:15 IST

ఎనభై అయిదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది. ఈ మేరకు ఒంగోలు నగరం హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు దగ్గుమాటి కోటమ్మ ఆదివారం తన హక్కు వినియోగించుకున్నారు. కోటమ్మకు మొత్తం ఏడుగురు సంతానం. ఈమె ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు వేస్తుందని చిన్న కుమారుడు దగ్గుమాటి వెంకట్రావు తెలిపారు. గత ఎన్నికల్లోనూ ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి ఓటు వేయించినట్లు వివరించారు. ఈసీ కల్పించిన అవకాశంతో ఈసారి ఇంటి వద్దనే అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ఓటు వేయించినట్లు తెలిపారు.    

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని