logo

శ్రీకూర్మంలో నిత్యాన్నదానం ప్రారంభం

గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో స్వామి నిత్యాన్నదాన కార్యక్రమం మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతులు మీదుగా బుధవారం ప్రారంభించారు. ముందుగా కూర్మనాథుని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మూడేళ్ల కిందట అనుకున్న నిత్యాన్నదాన కార్యక్రమం కార్యరూపం దాల్చేందుకు దాతలు అందించిన సహకారం అభినందనీయమన్నారు.

Published : 26 May 2022 06:22 IST

- న్యూస్‌టుడే, గార

గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో స్వామి నిత్యాన్నదాన కార్యక్రమం మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతులు మీదుగా బుధవారం ప్రారంభించారు. ముందుగా కూర్మనాథుని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మూడేళ్ల కిందట అనుకున్న నిత్యాన్నదాన కార్యక్రమం కార్యరూపం దాల్చేందుకు దాతలు అందించిన సహకారం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాలయాలకు వచ్చే నిధులు సక్రమంగా వినియోగించేందుకు కచ్చితమైన ట్రస్టుబోర్డు ఏర్పాటు, పర్యవేక్షణ అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి ట్రస్టుబోర్డు ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలని దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ శిరీషకు సూచించారు. అర్చకులు, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని