logo

వాన హోరు...!

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. 11 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఎచ్చెర్ల,

Published : 25 Jun 2022 06:04 IST

నరసన్నపేట మార్కెట్‌ వీధిలో మోకాలి లోతున నిలిచిన నీరు

 న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, లావేరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. 11 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఎచ్చెర్ల, ఆమదాలవలస మండలాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖరీఫ్‌ సాగుకు సిద్ధంగా మడులు నీటమునిగాయి. 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి ఉన్న సర్వీసు రోడ్లు చెరువులను తలపించాయి. పైడిభీమవరం నుంచి రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల వద్ద పెద్దఎత్తున నీరు చేరింది.ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడ్డారు. శ్రీకాకుళం నగరంలో లోతట్టు ప్రాంతంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి. సీఎం సభ జరగనున్న కోడిరామ్మూర్తి క్రీడామైదానంలో వర్షం నీరు చేరడంతో బయటకు తోడేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. నరసన్నపేట మండలంలో అత్యధికంగా 75.00 మి.మీ. లావేరులో అత్యల్పంగా 0.25 వర్షపాతం నమోదైంది.  

నవభారత్‌ కూడలి వద్ద సర్వీసు రహదారిలో ఇలా..


ప్రాణం తీసిన పిడుగు..

న్యూస్‌టుడే, పోలాకి: పోలాకి మండలంలోని పాత జడూరుకు చెందిన గొండు లక్ష్మణరావు (58) శుక్రవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఉరుములతో కూడిన వర్షం పడటంతో లక్ష్మణరావు పొలం వద్దనున్న ఆవులను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అదే సమయంలో లక్ష్మణరావు పక్కన పిడుగు పడటంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు. కొంతసేపటి తర్వాత అటుగా వెళ్లిన జేసీబీ డ్రైవరు చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని