logo

భక్తుల తాకిడి

ఆదిత్యాలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారు ఇంద్రపుష్కరిణిలో స్నానమాచరించి, సూర్యనమస్కారాల్లో పాల్గొన్నారు.

Published : 28 Nov 2022 04:10 IST

ఆదిత్యాలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారు ఇంద్రపుష్కరిణిలో స్నానమాచరించి, సూర్యనమస్కారాల్లో పాల్గొన్నారు. పలువురు కేశఖండనశాలలో మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం స్వామికి టిక్కెట్ల రూపంలో రూ.4,41,300, పూజలు, విరాళాల ద్వారా రూ.67,359, ప్రసాదాల విక్రయాల రూపంలో రూ.3 లక్షలు ఆదాయం వచ్చిందని ఈవో వి.హరిసూర్యప్రకాశ్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ్త సాయంత్రం 6 గంటలకు ధర్మపథంలో భాగంగా ఆలయ అనివెట్టి మండపంలో విజయనగరం శ్రీవారి స్వచ్ఛంద సేవాసంస్థ వారితో గాత్ర కచేరి నిర్వహించారు.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని