logo

మూడు అంబులెన్స్‌ల అందజేత

ఉద్దానం సేవా సమితి ప్రతినిధులు జిల్లాలో పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రోగులకు సేవలు అందించేందుకు మూడు ప్రత్యేక అత్యవసర వాహనాలు (అంబులెన్స్‌లు) అందజేశారు.

Published : 31 Mar 2023 05:52 IST

అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న ఉద్దానం సేవా సమితి ప్రతినిధులు

కంచిలి, న్యూస్‌టుడే: ఉద్దానం సేవా సమితి ప్రతినిధులు జిల్లాలో పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రోగులకు సేవలు అందించేందుకు మూడు ప్రత్యేక అత్యవసర వాహనాలు (అంబులెన్స్‌లు) అందజేశారు. ఒక్కోటి రూ.5.5 లక్షలతో వీటిని కొనుగోలు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. వీటిని ఒకటి పలాస, ఒకటి కంచిలి, మరోటి రిజర్వులో ఉంచుతామని ప్రతినిధులు తెలిపారు. బుడ్డెపు కామేష్‌ రెడ్డి, వేణు, అనిల్‌, హరి, చరణ్‌, రామారావు, ప్రదీప్‌ తదితర సేవా సంస్థ ప్రతినిధులు గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామపురం గ్రామానికి చెందిన ఓ చిన్నారి వైద్య సేవలకు రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని కూడా ప్రతినిధులు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని