logo

ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి

ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్‌ బి.నాగార్జునరావు సూచించారు.

Published : 28 Mar 2024 05:15 IST

మాట్లాడుతున్న నాగార్జునరావు, చిత్రంలో ఇతర అధికారులు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్‌ బి.నాగార్జునరావు సూచించారు. శ్రీకాకుళం వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్‌ కార్యాలయంలో విజయనగరం డివిజన్‌ ట్రేడ్‌ యూనియన్‌ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పంపిణీ నిమిత్తం వివిధ రకాల సామగ్రి తెప్పించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్నారు. వాటి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. బిల్లులు లేని సరకులు రవాణా చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు తమ పరిధిలోని వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి నిబంధనల పాటించేలా చూడాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.రాణిమోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని