logo

హీరోగా నటించడానికి సంశయించిన సూరి

హీరోగా నటించడానికి మొదట్లో సూరి సంశయించాడని నటుడు శివకార్తికేయన్‌ తెలిపారు. దర్శకుడు వెట్రిమారన్‌ కథ రాసి, దురై సెంథిల్‌ దర్శకత్వం వహించిన ‘గరుడన్‌’ 31న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Published : 22 May 2024 00:36 IST

శివకార్తికేయన్‌

చెన్నై, న్యూస్‌టుడే: హీరోగా నటించడానికి మొదట్లో సూరి సంశయించాడని నటుడు శివకార్తికేయన్‌ తెలిపారు. దర్శకుడు వెట్రిమారన్‌ కథ రాసి, దురై సెంథిల్‌ దర్శకత్వం వహించిన ‘గరుడన్‌’ 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం నగరంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివకార్తికేయన్‌ మాట్లాడుతూ... ‘సీమరాజా’ చిత్రీకరణ సమయంలో ప్రధానపాత్ర పోషించే చిత్రాలు ఎంచుకుని నటించాలని సూరికి సూచించినట్టు తెలిపారు.

అప్పట్లో ఆయన సంశయించారని, ఒక సినిమాలో హీరోగా నటించిన తర్వాత మిగతా సినిమాల్లో అవకాశాలు రాకపోతే అంటూ అనుమానం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత దర్శకుడు వెట్రిమారన్‌ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, అందులో ప్రధానపాత్ర పోషించనున్నట్లు సూరి చెప్పారని తెలిపారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పానన్నారు. హాస్యనటులు సీరియస్‌ పాత్రలను సులభంగా పోషించగలరని, దానికి సూరి ఓ ఉదాహరణ అన్నారు. సీరియస్‌ పాత్రలు పోషించేవారు అంత సులభంగా హాస్యపాత్రలు పోషించలేరని వెల్లడించారు. కార్యక్రమంలో దర్శకుడు వెట్రిమారన్, నటులు శశికుమార్, సముద్రఖని, విజయ్‌సేతుపతి, సూరి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని