logo

దశాబ్దం తర్వాత మదురై - తేని రైలు పునఃప్రారంభం

దశాబ్దం అనంతరం మదురై నుంచి తేని వరకు రైలు మార్గంలో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ద్వారా మొదటి రైలును ప్రారంభించనున్నారని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మదురైలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిసిింది

Published : 25 May 2022 01:29 IST

వడపళని, న్యూస్‌టుడే: దశాబ్దం అనంతరం మదురై నుంచి తేని వరకు రైలు మార్గంలో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ద్వారా మొదటి రైలును ప్రారంభించనున్నారని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మదురైలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిసిింది. 06701 నెంబరుతో మదురైలో అన్‌ రిజర్వుడు ప్రత్యేక రైలు ఉదయం 8.30 గంటలకు బయలుదేరి అదే రోజు 9.35 గంటలకు తేని చేరుకుంటుంది. వడపలంజి, ఉసిలాంపట్టి, ఆండిపట్టి స్టేషన్లలో ఆగుతుంది. తిరిగి 06702 నెంబరుతో తేనిలో సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి 7.35కు మదురైకి చేరుతుంది. ఆండిపట్టికి 6.28, ఉసిలాంపట్టికి 6.46, వడపలంజికి 7.04 నిమిషాలకు వస్తుంది. ఈ రైలులో పది జనరల్‌ సిట్టింగ్‌ బోగీలతోపాటు రెండు సిట్టింగ్‌, లగేజీ బోగీలుంటాయన్నారు. మదురై నుంచి తేని వరకు ఉన్న మీటర్‌ గేజి మార్గాన్ని బ్రాడ్‌ గేజి పనుల కోసం 2010, డిసెంబరు 31వ తేదీన మూసివేశారు. ఇప్పటికి బ్రాడ్‌ గేజి పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని