logo

చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం

చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి.

Published : 27 Apr 2024 01:51 IST

వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి
న్యూస్‌టుడే, వడపళని

చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. పైవంతెన కింద నుంచి తేలికపాటి వాహనాలు వెళ్లేందుకు అండర్‌పాస్‌, పాదచారులు నడిచేందుకు ప్రత్యేక మార్గం నిర్మాణం జరగాల్సి ఉందని జాతీయ రహదారుల విభాగం పేర్కొంది.

పెరిగిన నిర్మాణ సామగ్రి వ్యయం

రూ.295.97 కోట్ల వ్యయంతో జరుగుతున్న నిర్మాణం కాంట్రాక్టు ఒప్పందం మేరకు 2025 జనవరికల్లా పూర్తి కావాల్సి ఉంది. ఎల్‌వీయూపీ వద్ద అనుసంధానం అయ్యే రోడ్ల పని పూర్తయిందని, రోడ్డు వెడల్పు పూర్తి కావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి పోయాయని, పాత ధరలతో నిర్మాణం జరపడం కుదరదని కాంట్రాక్టరు సమస్యలు లేవనెత్తారు. దీంతో పనుల్లో కొంత జాప్యం అయింది.  కాంట్రాక్టరు పేర్కొన్న దానిపై జాతీయ రహదారుల విభాగం వ్యత్యాస నగదును చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో కాంట్రాక్టరు పనులు తిరిగి ప్రారంభించారని హైవేస్‌ విభాగాధికారులు పేర్కొన్నారు. కారనోడై వంతెన వద్ద ఒక లేనులో పనులు ముగియడంతో అక్కడ వాహనాలు కూడా అనుమతించామని చెప్పారు.

స్థల సమస్య

వంతెనను అనుసంధానం చేస్తూ జరగాల్సిన నిర్మాణానికి స్థల సమస్యతో మరి కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చెన్నై నుంచి తడ వరకు మొత్తం మరమ్మతులతో సరిపెట్టకుండా కొత్తగా జాతీయ రహదారుల విభాగం రోడ్డు వేయాలని కొందరు అంటున్నారు. కవరపట్టై, టోల్‌ప్లాజాలున్న ప్రాంతాల్లో పకడ్బందీగా మరమ్మతులు జరగాల్సి ఉంది. బాగా పాడైన రోడ్డుకు కూడా టోల్‌ ఛార్జీలు చెల్లిస్తున్నామని వాహన చోదకులు అధికారులకు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని