logo

బెదిరింపు రాజకీయాలకు భయపడం

బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్‌పేటలోని పోలింగ్‌బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్‌పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.

Published : 27 Apr 2024 00:57 IST

తమిళిసై

సైదాపేట, న్యూస్‌టుడే: బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్‌పేటలోని పోలింగ్‌బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్‌పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆళ్వార్‌పేటలోని గౌతమన్‌ ఇంటికి వెళ్లిన తాగునీటి బోర్డు అధికారులు అతని ఇంట్లో భూమి లోపల ట్యాంక్‌ (సంపు)ను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం గౌతమన్‌ ఇంటికి వెళ్లిన తమిళిసై జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ... తమిళనాడు ప్రభుత్వ అధికారులతో బెదిరించడం సబబుకాదన్నారు. గౌతమన్‌ గిరిజనుడని, అయితే అతను భాజపాకు చెందినవాడు కావడంతో అగ్ర కులానికి చెందినవాడని డీఎంకే కుల రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. గౌతమన్‌ ఇంట్లో సంపు సౌకర్యం మాత్రమే ఉందన్నారు. అయితే తాగునీటి బోర్డు అధికారులు ఆ సంపు కనెక్షన్‌ సైతం తొలగించేందుకు వెళ్లడం దారుణమన్నారు. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. డీఎంకేకు ఓటమి భయం పట్టుకుందని, ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడబోమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు