logo

స్మోక్‌ బిస్కెట్ల తయారీపై నిషేధం

చెన్నైలో లిక్విడ్‌ నైట్రోజన్‌ ఉపయోగించి తయారు చేసే స్మోక్‌ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది.

Published : 27 Apr 2024 01:49 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నైలో లిక్విడ్‌ నైట్రోజన్‌ ఉపయోగించి తయారు చేసే స్మోక్‌ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో స్మోక్‌ బిస్కెట్‌ తిన్న బాలుడు స్పృహకోల్పోయిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరలైన నేపథ్యంలో ప్రజలు లిక్విడ్‌ నైట్రోజన్‌ ఆహార పదార్థాలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ లిక్విడ్‌ నైట్రోజన్‌ ఆహారపదార్థాలకు పూర్తిగా నిషేధం విధిస్తున్నామని, నిబంధనలు మీరితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అదేవిధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, బేకింగ్‌ కోసం మాత్రమే నైట్రోజన్‌ ఉపయోగించాలని, అందుకు ఆహార భద్రతా శాఖ అనుమతి పొందాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు