logo

ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు.

Published : 27 Apr 2024 01:39 IST

తిరుప్పూర్‌ భాజపా అభ్యర్థి ఆరోపణ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. గతంలో ఓటు వేసి కార్డు పెట్టుకున్నవారికి ఈసారి ఓటుహక్కు తొలగించారన్నారు. విచారణ జరపాలని భాజపా తరఫున ఫిర్యాదు చేశామన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌ ఎన్నికల్లో తమ మొదటి విజయం నమోదైపోయిందని, సూరత్‌లో భాజపా అభ్యర్థికి పోటీగా అందరూ తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపికయ్యారన్నారు. దేశవ్యాప్తంగా 400 స్థానాల్లో భాజపానే ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో సరైన పోలింగ్‌ శాతం చెప్పలేక ఎన్నికల కమిషన్‌ గందరగోళపడటం అనుమానాలకు తావిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని