logo

చెన్నైలో ట్రాఫిక్‌ ఆంక్షలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సబ్‌వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్‌లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

Published : 27 Apr 2024 01:47 IST

వడపళని, న్యూస్‌టుడే: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సబ్‌వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్‌లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో ఆర్బీఐ సబ్‌వే, వంతెన వద్ద నాలుగో లైను, ఆర్సీసీ బాక్సు నిర్మాణ పనుల కారణంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి మూడు నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

  • రాయపురం వంతెన, రాజాజీ సాలై నుంచి కామరాజర్‌ సాలైకి వెళ్లాల్సిన వాహనాలు ఆర్బీఐ సబ్‌వే మీదుగా వార్‌ మెమోరియల్‌ వెళ్లడానికి అనుమతి లేదు.
  • వాహనాలు ఆర్బీఐ సబ్‌వే సర్వీసు రోడ్డు, నార్త్‌ ఫోర్ట్‌ సాలై, రాజా అన్నామలై మండ్రం, ముత్తుస్వామి సాలై, డాక్టర్‌ ముత్తుస్వామి బ్రిడ్జి, వాలాజా పాయింట్, ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్డు, వార్‌ మెమోరియల్‌ మీదుగా కామరాజర్‌ సాలై చేరుకోవాలి.
  • కామరాజర్‌ సాలై నుంచి ప్యారీస్‌ కార్నర్‌ వైపు వెళ్లాల్సిన వాహనాలు ఆర్బీఐ సబ్‌వే మీదుగా ఎప్పటిలాగానే వెళ్లొచ్చు.

టీనగర్‌లో ఏడాది పాటు..

టీనగర్‌ మ్యాడ్లీ రోడ్డు కూడలిలో పైవంతెన నిర్మాణం కారణంగా శనివారం నుంచి (ఏప్రిల్‌ 27) ఏడాది పాటు ట్రాఫిక్‌లో మార్పులు చేసినట్టు ఆ విభాగం తెలిపింది. ః నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డు, టీనగర్‌ బస్టాండు మీదుగా ఉస్మాన్‌ రోడ్డు పైవంతెన మీదకు వాహనాలకు అనుమతి లేదు. ః పైవంతెన సర్వీసు రోడ్డు గుండా టీనగర్‌ బస్టాండు, ప్రకాశం రోడ్డు, భాష్యం రోడ్డు, త్యాగరాజ రోడ్డు, బర్కిత్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి. ః బర్కిత్‌ రోడ్డు, మూపనార్‌ వీధి కూడలి నుంచి మ్యాడ్లీ రోడ్డుకు బస్సులను అనుమతిస్తారు. ః ఇతర వాహనాలు టీనగర్‌ బస్టాండుకు ఉస్మాన్‌ రోడ్డు, మూపారప్పన్‌ వీధి, మూస వీధి, సౌత్‌ దండపాణి వీధి, మన్నర్‌ వీధి గుండా రావాల్సి ఉంటుంది. ః టీనగర్‌ బస్టాండు, సౌత్‌ ఉస్మాన్‌ రోడ్డు మీదుగా సైదాపేట అన్నా రోడ్డు, కన్నమ్మపేట జంక్షన్‌, సౌత్‌ వెస్ట్‌ బోగ్‌ రోడ్డు, సీఐటీ నగర్‌ 4వ మెయిన్‌ రోడ్డు, సీఐటీ నగర్‌ 3వ మెయిన్‌ రోడ్డు మీదుగా వాహనాలు అన్నా రోడ్డు చేరుకోవాలి. ః సీఐటీ నగర్‌ మొదటి మెయిన్‌ రోడ్డు నుంచి నడిచే వాహనాలు కన్నమ్మపేట జంక్షన్‌ వద్ద నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డు, సౌత్‌ వెస్ట్‌ బోగ్‌ రోడ్డు, వెంకటనారాయణ రోడ్డు, నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డు, నాగేశ్వరన్‌ రోడ్డు మీదుగా పయనించాలి. ః టీనగర్‌ బస్టాండు నుంచి వచ్చే వాహనాలు మ్యాడ్లీ రోడ్డు చుట్టూ తిరిగి బర్కిత్‌ రోడ్డు, వెంకటనారాయణ రోడ్డు, నాగేశ్వరన్‌ రోడ్డు మీదుగా నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డుకు రావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని