logo

గోదాం ఇన్‌ఛార్జి సస్పెన్షన్‌

ఎలమంచిలి, నక్కపల్లి మండల స్టాక్‌ పాయింట్లలో గోదాం ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న ఎం.సత్యప్రకాశ్‌ను సస్పెండ్‌ చేస్తూ సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 04 Feb 2023 05:03 IST

కలెక్ట్టరేట్‌, న్యూస్‌టుడే: ఎలమంచిలి, నక్కపల్లి మండల స్టాక్‌ పాయింట్లలో గోదాం ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న ఎం.సత్యప్రకాశ్‌ను సస్పెండ్‌ చేస్తూ సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు స్టాక్‌ పాయింట్లలో రూ.16 లక్షల విలువైన సరకులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రావడంతో నర్సీపట్నం ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. ఆర్డీవో ఇచ్చిన నివేదికలో సత్యప్రకాశ్‌ సరకులను పక్కదారి పట్టించారని తేలడంతో సస్పెండ్‌ చేసినట్లు జేసీ పేర్కొన్నారు. రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయ సంక్షేమ సహాయకుడు ..

రోలుగుంట: కుసర్లపూడి సచివాలయం వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ లాలం సూర్యనారాయణమూర్తిని జిల్లా అధికారులు సస్పెండ్‌ చేశారు. రొంగలిపాలెం పంచాయతీకి సంబంధించి 13 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద ఒక్కో విద్యార్థికి 25 ఎకరాలు చొప్పున భూమి ఉన్నట్లుగా ఆన్‌లైన్‌లో ఉద్దేశపూర్వకంగా నమోదు చేసి, వారు లబ్ది పొందకుండా చేశారని సర్పంచి శెట్టి లోవరాజు కలెక్టర్‌ రవికి, అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికితోడు ఆధార్‌ కార్డుల్లో వయసులను దిద్దుబాటు చేసి పింఛన్లు పొందేందుకు అవకాశం కల్పించారని ఫిర్యాదు ఉంది. వీటిపై విచారణ అనంతరం ఆయనను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు