logo

విశాఖలో వైకాపాకు స్థానం లేదు: గంటా

జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ అభివృద్ధి గురించి ఎన్నిమాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated : 07 Mar 2024 06:11 IST

మాట్లాడుతున్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ అభివృద్ధి గురించి ఎన్నిమాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజన్‌ విశాఖ అంటూ జగన్‌ 28 పేజీల డాక్యుమెంట్‌ను విడుదల చేశారని.. దీనిని ఎప్పుడు విడుదల చేయాలో కూడా కనీస అవగాహన ఆయనకు లేదన్నారు. వారం రోజుల్లో ఎన్నికల కోడ్‌ రాబోయే తరుణంలో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ ఐదేళ్లలో విశాఖకు ఒక్క ఇన్‌స్టిట్యూట్‌ గాని, ఒక్క పరిశ్రమ గానీ రాలేదన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ఇక్కడ 17 హెలీప్యాడ్‌లు నిర్మించారని.. అదొక్కటే అభివృద్ధి అంటూ విమర్శించారు. చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తే ఓడిపోతారని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఓడిపోయిన అనుభవంతో ఆయన మాట్లాడుతున్నారని, తనకు ఓటమి అనే చరిత్ర లేదని చమత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని