logo

రౌడీగా మారిన బూడికి బుద్ధి చెప్పండి

కాపులంతా ఐక్యంగా ఉండి ఎమ్మెల్యే కన్నబాబురాజును చిత్తుగా ఓడించాలని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు.

Published : 06 May 2024 02:58 IST

ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పిలుపు

డమ్మీ ఈవీఎం చూపించి ఓటు ఎలా వేయాలో వివరిస్తున్న ఎంపీ అభ్యర్థి రమేశ్‌, వేదికపై అసెంబ్లీ అభ్యర్థి సుందరపు తదితరులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: కాపులంతా ఐక్యంగా ఉండి ఎమ్మెల్యే కన్నబాబురాజును చిత్తుగా ఓడించాలని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు. ఎలమంచిలిలో ఆదివారం తూర్పుకాపు సంఘం జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  భూ కబ్జాకోరు కన్నబాబు రాక్షస పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి కొత్త పథకం ముందుగా అనకాపల్లి జిల్లాకు వచ్చేలా చేస్తానన్నారు. ఈ ప్రాంతాన్ని పారిశామ్రికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రౌడీగా మారిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు మీరే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యకర్తలను, నాయకులను కొడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసుల సమక్షంలో బూడి తమ కార్యకర్తలను కొట్టాడని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడికి చేరుకుంటానన్నారు. బూడి చేసిన రౌడీయిజంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానని, సోమవారం మధ్యాహ్నానికి మంచి వార్త వింటారన్నారు. బూడి కొడుకు మనకు మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తాళ్లపాలెంలో నిర్వహించే బహిరంగ సభకు  ప్రధాని మోదీ హాజరవుతున్నారన్నారు.  ఇక అయిదు రోజులే సమయం ఉందని, బాగా కష్టపడి ఇంటింటికీ తిరిగి తనను, విజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. ఈవీఎంలో ఎలా ఓటు వేయాలో డమ్మీ ఈవీఎంల ద్వారా ఆయన చూపించారు. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాపులకు ఇంత కాలానికి అవకాశం వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కాపు సంఘం నాయకులు సీఎం రమేశ్‌ను ఘనంగా సన్మానించారు. తూర్పుకాపు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి.అప్పారావు, శ్రీహరి, గుర్రాల శ్రీనివాస్‌, బొద్దపు శ్రీను, గొర్లె నానాజీ, పిట్టా శ్రీను, కొఠారు నరేష్‌, కొఠారు శ్రీను, ఊడి బాబులు, అడపా శేషగిరి, పప్పు ఈశ్వరరావు, నక్కా శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని