logo

ఏపీఎల్‌ వేలంలో నితీశ్‌కుమార్‌రెడ్డికి అత్యధిక ధర

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్‌లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్‌కుమార్‌రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్‌ గోదావరి టైటాన్స్‌ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది.

Updated : 17 May 2024 03:03 IST

రూ. 15.60 లక్షలకు మార్లిన్‌ గోదావరి టైటాన్స్‌కు సొంతం

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్‌లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్‌కుమార్‌రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్‌ గోదావరి టైటాన్స్‌ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ జట్టుకు నితీశ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

వేలంలో నాలుగు విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 408 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వారిని కొనుగోలు చేసేందుకు రాయలసీమకింగ్స్‌, కోస్టల్‌రైడర్స్‌, కె.వి.ఆర్‌.ఉత్తరాంధ్రలైన్స్‌, మార్లిన్‌ గోదావరి టైటాన్స్‌, బెజవాడ టైగర్స్‌, వైజాగ్‌ వారియర్స్‌ ప్రాంఛైజర్లు పోటీ పడ్డారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథరెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్‌ ద్వారా ఆంధ్రా క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమన్నారు. జూన్‌ 30 నుంచి జులై 13 వరకు ఏపీఎల్‌-3 ప్రారంభమవుతుందన్నారు. కడపలో ఏడు, విశాఖలో 12 మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలో ఇప్పటి వరకు రెండు సీజన్లు పూర్తి చేయడం
జరిగిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని