logo

వైజాగ్‌ కన్వెన్షన్‌లో మెగా కన్జ్యూమర్‌ ఎక్స్‌పో

పీఎంపాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో ఇండియా ఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ ఫెయిర్‌(ఐఐసీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్‌ ఎక్స్‌పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్‌ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు.

Published : 18 May 2024 02:49 IST

కన్వెన్షన్‌లో ప్రదర్శనకు ఉంచిన సామగ్రి

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పీఎంపాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో ఇండియా ఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ ఫెయిర్‌(ఐఐసీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్‌ ఎక్స్‌పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్‌ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. 70 శాతం తగ్గింపు ధరలపై ఫర్నీచర్, ఇంటీరియర్‌ ఉత్పత్తులు అందిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎక్స్‌పోనకు శుక్రవారం నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రాంగణంలో తినుబండారాల స్టాల్స్‌ సైతం ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని