logo

Ap news: నిబంధ‌న‌ల‌ను కచ్చితంగా పాటించాలి

జూన్ 4వ తేదీన జ‌రిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ‌లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొద‌ల‌వుతుంద‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్టర్ నాగ‌ల‌క్ష్మి తెలిపారు.

Published : 25 May 2024 17:31 IST

విజయనగరం గ్రామీణం: జూన్ 4వ తేదీన జ‌రిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ‌లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొద‌ల‌వుతుంద‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్టర్ నాగ‌ల‌క్ష్మి తెలిపారు. ఈ ప్రక్రియ ఉద‌యం 8 గంట‌ల‌క‌ల్లా కచ్చితంగా ప్రారంభించాల‌ని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది అంతా ఉద‌యం 6 గంట‌ల‌కే లెక్కింపు కేంద్రాల‌ వ‌ద్దకు చేరుకొని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాల‌ని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొద‌లైన త‌రువాత‌, ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఈవిఎం ఓట్ల లెక్కింపును మొద‌లు పెట్టాల‌ని చెప్పారు. ఓట్లను లెక్కించే కౌంటింగ్ సూప‌ర్‌వైజ‌ర్లు, స‌హాయ‌కులకు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మొద‌టి విడ‌త శిక్షణా కార్య‌క్రమాన్ని శ‌నివారం నిర్వహించారు ఈ శిక్షణా కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్‌డీ అనిత‌, ట్రైనింగ్స్ నోడ‌ల్ ఆఫీస‌ర్ సుధాక‌ర‌రావు, ఎల‌క్షన్ సెల్ సూప‌రింటిండెంట్ ప్రభాక‌ర‌రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు