logo

Warangal: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక  పోలింగ్ సోమవారం జరగనుంది.

Published : 26 May 2024 18:29 IST

హనుమకొండ: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక  పోలింగ్ సోమవారం జరగనుంది. ఉదయం 8 నుంచి  సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, ఇందుకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు తరలించే పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను, ఇతర పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తుండగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని