logo

పాలకుర్తి.. ఆధ్యాత్మిక కీర్తి!

పాలకుర్తి నియోజకవర్గం జనగామ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉం

Published : 28 Oct 2023 05:42 IST

సోమేశ్వరాలయ ముఖద్వారం

పాలకుర్తి నియోజకవర్గం జనగామ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉంది. దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర మండలాలున్నాయి. నియోజకవర్గంలో తొర్రూరు ఒక్కటే మున్సిపాలిటీ. 

పాలకుర్తి, న్యూస్‌టుడే

నియోజకవర్గం ముచ్చట

గత చరిత్ర.. ఓ మైలు రాయి

పాలకుర్తి.. పోరాటాల గడ్డ, సాహిత్య నేల. కవులు, కళాకారులకు పుట్టినిల్లు. ఇక్కడ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. పాల్కుర్కి సోమనాథుడు కూడా ఈ గడ్డపైనే పురుడు పోసుకున్నారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. దక్షణ అయోధ్యగా పిలుస్తున్న వల్మిడి లవకుశల జన్మస్థలం. వాల్మీకి మహర్షి రెండు కొండల మధ్య తపస్సు చేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. పర్యాటకాభివృద్ధిలో భాగంగా ఈ మూడు ప్రాంతాలను సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి చేశారు. వల్మిడి రాముల గట్టుపై నూతన రామాలయ నిర్మాణాన్ని నిర్మించారు.

  • నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా మెట్ట పంటలే పండిస్తున్నారు. కొన్నేళ్లుగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాగునీటి వనరులు పెరగడమే దీనికి ప్రధాన కారణం.

రాజకీయ స్వరూపం

పునర్విభజనలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. 14 ఎన్నికల్లో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థులు ఐదుసార్లు గెలుపొందగా.. తెలుగుదేశం నాలుగు సార్లు, సోషలిస్టు, పీడీఎఫ్‌, భారాస, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. 2014లో తెదేపా తరఫున విజయం సాధించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 2016లో భారాసలో చేరారు.

  • 1952లో సార్వత్రిక ఎన్నికలు రాగా ఈ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పగూడెం పరిధిలో ఉండేది. అప్పుడు విఠల్‌రావు కోదాటి నారాయణరావుపై గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1957 నుంచి 2004 వరకు చెన్నూరు (ఉమ్మడి వరంగల్‌ జిల్లా) నియోజకవర్గంగా కొనసాగింది. అనంతరం చెన్నూరు నుంచి పాలకుర్తి నియోజకవర్గంగా 2009లో మార్చారు.
  • యతిరాజారావు కుటుంబం ఇక్కడ అప్రతిహతపాలన కొనసాగించింది. 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఒకసారి ఉపఎన్నికలో ఏకగ్రీవంగా విజయం సాధించారు.  యతిరాజారావు 1985లో ఎన్టీరామారావు మంత్రివర్గంలో పనిచేశారు.
  • ఎర్రబెల్లి దయాకర్‌రావు గత మూడు ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని