logo

హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది.

Updated : 29 Apr 2024 07:37 IST

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. మన వరంగల్‌లో ఇటీవల హోటళ్ల మధ్య పోటీ పెరిగింది. ఇందులో నిలదొక్కుకోవడానికి నిర్వాహకులు వినూత్న పోకడలు అవలంబిస్తున్నారు. వింత పేర్లతో ఆహారప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆకర్షణీయమైన అలంకరణలతో కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. అరణ్యం, జైలు, రైల్వే ప్లాట్‌ఫాం, సముద్రతీరం, గుహలు, పల్లె వాతావరణం, పార్కు, ప్రేమికుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గదుల్లో విందు చేస్తున్నట్లు ఏర్పాట్లు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

న్యూస్‌టుడే, రంగంపేట, ఎన్జీవోస్‌కాలనీ

పొట్ట పెంచుకుందాం..  

కాకతీయ వైద్య కళాశాల ఎదురుగా రంగంపేట సెంటర్‌లో ఇటీవల ఏర్పాటైన ‘పొట్ట పెంచుకుందాం..’ అనే రెస్టారెంట్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. ‘ఈ పేరుతో ఎక్కడైనా రెస్టారెంట్లు ఉన్నాయా? అని గూగుల్‌లో సెర్చ్‌ చేశామని.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరులో ఉందని.. తెలంగాణలో ఎక్కడా లేదని నిర్ధారణకు వచ్చాక ఇక్కడ ఏర్పాటు చేశామని నిర్వాహకుడు హరికృష్ణ తెలిపారు.

పట్టభద్రుల ఉపాధి బాట..

హనుమకొండ ప్రాంతానికి చెందిన హరికృష్ణ, సుభాష్‌, ప్రదీప్‌ ముగ్గురు యువకులు హంటర్‌రోడ్‌ మాస్టర్‌జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. స్వయం ఉపాధి కోసం అన్వేషించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఈవెంట్లు తదితర శుభకార్యాల్లో కెమెరా అద్దెకు తెచ్చుకొని ఫొటోలు, వీడియోలు తీశారు. రెండేళ్లలోనే సుమారు రూ.4 లక్షలతో సొంతంగా కొత్త కెమెరా తీసుకొని నయీంనగర్‌లో ‘ఫొటోల అబ్బాయి’ పేరుతో స్టూడియో ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో వరంగల్‌ రంగంపేటలో ‘పొట్ట పెంచుకుందాం’ పేరుతో రెస్టారెంటు ప్రారంభించారు.

జైలు మండి

ఆహా..

వరంగల్‌ నగరంలో పాపడం, జైలు మండి, అరణ్యం, రైల్వే ప్లాట్‌ఫాం నెంబర్‌ 65, వైట్‌హౌస్‌, జమీందార్‌, హార్ట్‌స్పాట్‌, లేట్‌నైట్‌, సెకండ్‌ వైఫ్‌, అరిటాకు భోజనం, పచ్చి పులుసు, ప్రకృతి, పల్లె రుచులు, హాట్‌ కిచెన్‌ గురూ, నాటుకోడి.. చిట్టిగారె, నల్లిబొక్క.. మటన్‌ ముక్క, ఉల్టా.. పల్టా తదితర పేర్లతో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు.

అరణ్యం హోటల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు