logo

నీట్‌కు 13 మంది గైర్హాజరు

జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పరీక్షకు ఉదయం 11 నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.

Updated : 06 May 2024 06:39 IST

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పరీక్షకు ఉదయం 11 నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఉన్నతాధికారులు సూచించిన మేరకు నిర్ణీత సమయంలోగా చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టారు. ప్రతి విద్యార్థిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో మొత్తం 702 మంది విద్యార్థులకు గాను 689 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారని నీట్‌ పరీక్ష జనగామ కోఆర్డినేటర్‌ శిల్పా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని