logo

పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే

నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు.

Published : 20 May 2024 02:45 IST

మాట్లాడుతున్న భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి  గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి  

సుబేదారి, న్యూస్‌టుడే: నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయ సంఘాలు, ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నానని చెప్పారు. వరంగల్‌కు ఉద్యమ చరిత్ర ఉందని, ఇక్కడి వ్యక్తినైన తనను మండలికి పంపించాలని విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భాజపా ప్రజా ప్రతినిధులు లేనప్పటికీ కేంద్రం నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిందన్నారు. పలు పథకాల కింద రూ.కోట్ల నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా అడ్డుకుందని ఆరోపించారు. దేశంలో ఏడు టెక్స్‌టైల్‌ పార్కులను అనుమతి ఇస్తే.. అందులో ఒకటి వరంగల్‌కు ఇచ్చారని గుర్తు చేశారు. రామప్ప ఆలయానికి  యూనెస్కో గుర్తింపు రావడంతో వరంగల్‌ జిల్లా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. కాంగ్రెస్, భారాస అభ్యర్థులు గెలిస్తే ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. తనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో నిలదీస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. మీట్‌ దప్రెస్‌ లో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి అమర్, పాత్రికేయుల సంఘం నాయకులు రాజీరెడ్డి, దయాసాగర్, వివిధ పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని