logo

భీమవరంలో ఫిర్యాదు చేయండి

రుణయాప్‌ నిర్వాహకుల ఆగడాలకు కడియం గ్రామానికి చెందిన యువకుడు కోనా సతీశ్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా.. దీనికి సంబంధించి భీమవరంలో కేసు నమోదైందని కడియం సీఐ రాంబాబు చెప్పారు. తమ కుమారుడు మృతి చెందినప్పటికీ

Published : 29 Jun 2022 04:27 IST

రుణయాప్‌ బాధిత మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసుల సూచన

కడియం, న్యూస్‌టుడే: రుణయాప్‌ నిర్వాహకుల ఆగడాలకు కడియం గ్రామానికి చెందిన యువకుడు కోనా సతీశ్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా.. దీనికి సంబంధించి భీమవరంలో కేసు నమోదైందని కడియం సీఐ రాంబాబు చెప్పారు. తమ కుమారుడు మృతి చెందినప్పటికీ అసభ్య ఫొటోలు, సందేశాలు తమ సెల్‌ఫోన్లకు నిరంతరంగా వస్తున్నాయని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం బాధితులు మరోసారి కడియం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై సీఐ రాంబాబు మాట్లాడుతూ భీమవరంలో ఆత్మహత్యకు పాల్పడటంతో అక్కడి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. దీనిపై రెండుచోట్ల కేసు నమోదుకు అవకాశం లేదని, భీమవరం వెళ్లి అక్కడి పోలీసులను సంప్రదించి పూర్తి వివరాలు వెల్లడించి దర్యాప్తుకు సహకరించాలని వారికి సీఐ సూచించారు. ఇప్పటికే బాధితులు చెప్పిన విషయాలను అక్కడి పోలీసు అధికారులకు చరవాణిలో వివరించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని