logo

ముగిసిన నామినేషన్ల పరిశీలన

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు.

Published : 27 Apr 2024 04:22 IST

పార్లమెంటుకు 21.. అసెంబ్లీకి 96 ఆమోదం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా 21 ఆమోదం పొందాయి. ఆరింటిని తిరస్కరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా దాఖలైన మూడు, తగినంతమంది ప్రతిపాదకులు లేని ఇద్దరు అభ్యర్థులు, ఎ, బి ఫాంలు అఫిడవిట్‌లో సమర్పించక పోవడంతో ఒక అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. గూడూరి ఉమాబాల (వైకాపా), భూపతిరాజు శ్రీనివాసవర్మ (భాజపా), కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు (కాంగ్రెస్‌), సిర్రా రాజు (బీఎస్పీ), ఓలేటి నాగేంద్రకృష్ణ (జైభీమ్‌రావు భారత్‌ పార్టీ), పూర్ణిమ గంజి (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా-ఎ), మన్నే లీలారామ్‌ నరేంద్ర (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), మరో 12 మంది స్వతంత్ర అభ్యర్థుల నామపత్రాలు ఆమోదం పొందాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆచంట- 11, పాలకొల్లు- 16, నరసాపురం- 12, భీమవరం- 17, ఉండి- 17, తణుకు- 10, తాడేపల్లిగూడెం- 13 చొప్పున నామపత్రాలను ఆమోదించారు. బీ వైకాపా, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేశారు. తెదేపా అభ్యర్థులు నాలుగు చోట్ల (ఉండి, ఆచంట, పాలకొల్లు, తణుకు), జనసేన తరఫున మూడు చోట్ల (భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం) నామినేషన్లు వేశారు. వారి నామపత్రాలన్నీ ఆమోదం పొందాయి. బహుజన సమాజ్‌ పార్టీ నుంచి ఆరుచోట్ల, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, జైభీమ్‌రావుభారత్‌ పార్టీల నుంచి నాలుగేసి నియోజకవర్గాల్లో నామినేషన్లు ఆమోదం పొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు